పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 7 చిట్టమూరు మండలం,
మల్లాం సెక్టార్ కోగిలి పంచాయతీ కోగిలి గ్రామం నందు అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ ముని కుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో సూపర్వైజర్ కవిత తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
తల్లిపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధి నిరోధక టేకా అని తెలిపారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అని తెలిపారు.
6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని తెలిపారు.
ఈ సమావేశంలో అంగనవాడి కార్యకర్తలు, బాలమణి,సరోజనమ్మ, రాజమ్మ, పార్వతి, సుశీలమ్మ, చెల్లమ్మ, ఆశా వర్కర్లు వీరనారాయణమ్మ, హైమావతి, ఏఎన్ఎం నర్సు మస్తానమ్మ,తల్లులు తదితరులు పాల్గొన్నారు.



