సంతవేలూరు, వరదయ్యపాలెం మండలంలోని మోడల్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేష్ గారి పదవీ విరమణ కార్యక్రమంలో గౌరవ సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొని, వెంకటేష్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీ నందకిషోర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కరుణాకర్ నాయుడు గారు, శ్రీ దశరథన్ గారు, శ్రీ అర్జున్ రెడ్డి గారు, శ్రీ జి. మురళి గారు, మాజీ ఎంపీపీ, నాగలాపురం, తదితరులు పాల్గొన్నారు.


