కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 22 :ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని నిన్న కొన్ని అనివార్య కారణాలవల్ల శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.
జగ్గంపేట రావులమ్మ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో శనివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.ముఖ్యంగా కాట్రావులపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు కాట్రావులపల్లి గ్రామ త్రాగునీటి అవసరాల కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో భావారం నుండి వచ్చే ఫిల్టర్ నీరు కాట్రావులపల్లి గ్రామ హై స్కూల్ ఎదురుగా నీటి సంపు కట్టించి శుక్రవారం ట్రయల్ రన్ కూడా పూర్తి చేసామని ఈ సంపు వద్ద ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసి 24 గంటల విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఆయన వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పిల్లా చంటిబాబు, రేఖ బుల్లి రాజు, సుంకవిల్లి రాజు, దాసరి సీతారామకృష్ణ, పురం శెట్టి శివాజీ, వేములకొండ జోగారావు, సత్తి సదాశివరెడ్డి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా దర్బార్లో ప్రజా సమస్య లకు సత్కర్ పరిష్కారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 22 :ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని నిన్న కొన్ని అనివార్య కారణాలవల్ల శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట రావులమ్మ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో శనివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.ముఖ్యంగా కాట్రావులపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు కాట్రావులపల్లి గ్రామ త్రాగునీటి అవసరాల కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో భావారం నుండి వచ్చే ఫిల్టర్ నీరు కాట్రావులపల్లి గ్రామ హై స్కూల్ ఎదురుగా నీటి సంపు కట్టించి శుక్రవారం ట్రయల్ రన్ కూడా పూర్తి చేసామని ఈ సంపు వద్ద ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసి 24 గంటల విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఆయన వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పిల్లా చంటిబాబు, రేఖ బుల్లి రాజు, సుంకవిల్లి రాజు, దాసరి సీతారామకృష్ణ, పురం శెట్టి శివాజీ, వేములకొండ జోగారావు, సత్తి సదాశివరెడ్డి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

