- ప్రజల మోయలేని భారాలు మోపుతున్న జగనన్న
*సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్*
*సంస్కరణల పేరుతో పేద ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేశ్ విమర్శించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ 2022 -23 పై సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞానకేంద్రంలో “నగరాభివృద్ధి -సంస్కరణలు- ప్రజలపై పన్నుల భారాలు” అనే పేరుతో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు.*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అన్ని రంగాలను ప్రైవేటీకరించడం, పౌర సేవలకు యూజర్ చార్జీలు వసూలు చేయడమే తమ విధానాలుగా అన్ని రాష్ట్రాలకు నిర్దేశించిదన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో వేగవంతంగా సంస్కరణలు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
దానిలో భాగంగానే ఇంటి పన్ను భారీగా పెంచడం, చెత్త పన్ను విధించడం, నీటి కొళాయి లకు మీటర్లు బిగించడం లాంటి చర్యలకు పట్టణాల్లో, నగరాల్లో శ్రీకారం చుట్టి ఉన్నారన్నారు. ఇదే నిజమైన అభివృద్ధి గా ప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ బడ్జెట్టు గత సంవత్సరం 720 కోట్ల రూపాయలని అంచనా వేయగా 350 కోట్ల కు తగ్గిపోయింది అన్నారు. వాటిలో 139 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేశారన్నారు. ప్రజలపై భారాలు మోపడం లక్ష్యంగా పెట్టుకుని పని చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కరోనా లాక్డౌన్ కాలంలో ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న టువంటి ప్రజల పై భారాలు మోపడం సరికాదన్నారు.*
*సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ గత సంవత్సరం 139 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయగా, రాబోయే సంవత్సరంలో దానిని 490 కోట్లకు అంచనాలుగా అప్పడం పాలకుల ఆలోచన ఏ విధంగా ఉందో స్పష్టం చేస్తోందన్నారు. రాబోయే సంవత్సరంలో ఇంటి పన్నులు 65 కోట్లు, మంచినీటి పన్నులు 15 కోట్లు, చెత్త పన్ను 10 కోట్లు, ట్రేడ్ చార్జీలు 3 కోట్లు, బిల్డింగ్ అనుమతుల పేరుతో 30 కోట్లు ఇలా అనేక పేర్లతో నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల భారాన్ని నగర ప్రజలపై మోపడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగేశ్వరరావు, పి. సూర్యనారాయణ, అత్తి మూర్తి శ్రీనివాసులు ప్రసంగించారు.*
*సిపిఎం నగర కమిటీ సభ్యులు ఉడతా ప్రసాద్, ఆర్ శ్రీనివాసులు, మూలం ప్రసాద్, ఏమేలు, నరసింహ, చిరంజీవి, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు*