Monday, 25 May 2026
  • Home  
  • ప్రకృతి వైద్యానికి ఔషధ మొక్కలే బలం: సీఈవో ఆవుల చంద్రశేఖర్
- చిత్తూరు

ప్రకృతి వైద్యానికి ఔషధ మొక్కలే బలం: సీఈవో ఆవుల చంద్రశేఖర్

ఔషధ మొక్కలతో కూడా మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ అన్నారు. పలు వ్యాధుల నియంత్రణకు ప్రకృతి మందులు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. చిత్తూరులో సోమవారం శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. జ్యోతేశ్వరి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ, నర్సింగ్ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ సి. రాధిక, డాక్టర్ ఎస్. ఫిరోజ్, ఏపీఎంఏపీ మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, ఆగ్రో టెక్నాలజీ నిపుణులు విజయకుమార్, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన ఐదుగురు విద్యార్థులు, అధ్యాపకులకు ప్రత్యేక ప్రశంసాపత్రాలను అందజేసి సత్కరించారు. ఏపీఎంఏపీ బోర్డు రూపొందించిన వీడియోలు, పిపిటిలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రాచీన సాంప్రదాయ వైద్యం ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చన్నారు. ప్రకృతి ప్రసాదించే వనమూలికలతో పాటు, ఔషధ సుగంధ మొక్కలతో మెరుగైన వైద్యం సాధ్యమన్నారు. విద్యాలయ ప్రాంగణాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఔషద మొక్కలు సాగుచేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుందన్నారు. ముఖ్యంగా తులసి, అలోవెరా (కలబంద), అశ్వగంధ వంటి మూలికలు సాగుకు అనుకూలమన్నారు. నీరు నిలవని నేలలు, సేంద్రియ ఎరువులు, క్రమబద్ధమైన నీటిపారుదల, మార్కెటింగ్ పరిజ్ఞానం ద్వారా ఈ సాగులో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చన్నారు. ముఖ్యమైన ఔషధ మొక్కల పెంపకం సాగు విధానాన్ని ఆయన వివరించారు. నీరు నిలవని నేలలు ఔషధ మొక్కల సాగుకు ఎంతో అనుకూలమన్నారు. తులసి, అశ్వగంధ, అలోవెరా, వేప, నేలవాము, రణపాల, అమృతవల్లి (తిప్పతీగ), వస, కిత్తనార వంటివి వున్నాయన్నారు. నీటి సౌకర్యం ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. ముఖ్యంగా ఆకుకూరల తరహాలో నీరు అందించాలన్నారు. నేరుగా విత్తనాలు చల్లడం లేదా కొమ్మల ద్వారా మొక్కలను పెంచవచ్చన్నారు. పోషణకు సేంద్రియ పద్ధతులు, కంపోస్ట్ ఎరువులు నేల సారాన్ని, మొక్క ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. అశ్వగంధ, పసుపు, అల్లం, కలబంద వంటి వాటికి మంచి మార్కెట్ వుందన్నారు. ఔషధ మొక్కల సాగుతో అనేక లాభాలున్నాయన్నారు. స్వల్ప పెట్టుబడితో, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. చాలా మొక్కలు తక్కువ నీటితో, కరువు పరిస్థితులను తట్టుకుని పెరుగుతాయని వివరించారు. ఈ మొక్కలను ఆయుర్వేద, యూనానీ, అల్లోపతి మందుల తయారీలో ఉపయోగిస్తారన్నారు. ప్రభుత్వాల నుంచి జాతీయ, రాష్ట్ర మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ ద్వారా సాగుకు అవసరమైన ప్రోత్సాహం అందుతుందన్నారు. ప్రత్యేక శిక్షణ కూడా పొందవచ్చన్నారు. ఔషదమొక్కలు పెంచేటప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఆరోగ్యకరమైన మొక్కలను ఎంచుకోవాలన్నారు. మొక్కల సాగు, కోత సమయాల్లో అవగాహన ఉండాలన్నారు. సేంద్రియ పద్ధతులను పాటించడం వల్ల నేల సారం పెరుగుతుందన్నారు.

ఔషధ మొక్కలతో కూడా మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ అన్నారు. పలు వ్యాధుల నియంత్రణకు ప్రకృతి మందులు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. చిత్తూరులో సోమవారం శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. జ్యోతేశ్వరి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ, నర్సింగ్ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ సి. రాధిక, డాక్టర్ ఎస్. ఫిరోజ్, ఏపీఎంఏపీ మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, ఆగ్రో టెక్నాలజీ నిపుణులు విజయకుమార్, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన ఐదుగురు విద్యార్థులు, అధ్యాపకులకు ప్రత్యేక ప్రశంసాపత్రాలను అందజేసి సత్కరించారు. ఏపీఎంఏపీ బోర్డు రూపొందించిన వీడియోలు, పిపిటిలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రాచీన సాంప్రదాయ వైద్యం ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చన్నారు. ప్రకృతి ప్రసాదించే వనమూలికలతో పాటు, ఔషధ సుగంధ మొక్కలతో మెరుగైన వైద్యం సాధ్యమన్నారు. విద్యాలయ ప్రాంగణాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఔషద మొక్కలు సాగుచేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుందన్నారు. ముఖ్యంగా తులసి, అలోవెరా (కలబంద), అశ్వగంధ వంటి మూలికలు సాగుకు అనుకూలమన్నారు. నీరు నిలవని నేలలు, సేంద్రియ ఎరువులు, క్రమబద్ధమైన నీటిపారుదల, మార్కెటింగ్ పరిజ్ఞానం ద్వారా ఈ సాగులో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చన్నారు. ముఖ్యమైన ఔషధ మొక్కల పెంపకం సాగు విధానాన్ని ఆయన వివరించారు. నీరు నిలవని నేలలు ఔషధ మొక్కల సాగుకు ఎంతో అనుకూలమన్నారు. తులసి, అశ్వగంధ, అలోవెరా, వేప, నేలవాము, రణపాల, అమృతవల్లి (తిప్పతీగ), వస, కిత్తనార వంటివి వున్నాయన్నారు. నీటి సౌకర్యం ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. ముఖ్యంగా ఆకుకూరల తరహాలో నీరు అందించాలన్నారు. నేరుగా విత్తనాలు చల్లడం లేదా కొమ్మల ద్వారా మొక్కలను పెంచవచ్చన్నారు.
పోషణకు సేంద్రియ పద్ధతులు, కంపోస్ట్ ఎరువులు నేల సారాన్ని, మొక్క ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. అశ్వగంధ, పసుపు, అల్లం, కలబంద వంటి వాటికి మంచి మార్కెట్ వుందన్నారు. ఔషధ మొక్కల సాగుతో అనేక లాభాలున్నాయన్నారు. స్వల్ప పెట్టుబడితో, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. చాలా మొక్కలు తక్కువ నీటితో, కరువు పరిస్థితులను తట్టుకుని పెరుగుతాయని వివరించారు. ఈ మొక్కలను ఆయుర్వేద, యూనానీ, అల్లోపతి మందుల తయారీలో ఉపయోగిస్తారన్నారు. ప్రభుత్వాల నుంచి జాతీయ, రాష్ట్ర మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ ద్వారా సాగుకు అవసరమైన ప్రోత్సాహం అందుతుందన్నారు. ప్రత్యేక శిక్షణ కూడా పొందవచ్చన్నారు. ఔషదమొక్కలు పెంచేటప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఆరోగ్యకరమైన మొక్కలను ఎంచుకోవాలన్నారు. మొక్కల సాగు, కోత సమయాల్లో అవగాహన ఉండాలన్నారు. సేంద్రియ పద్ధతులను పాటించడం వల్ల నేల సారం పెరుగుతుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.