డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం పొన్నమండ గ్రామంలోని హైస్కూల్‌కు వెళ్లే రహదారిలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్ల అడ్డు గోడలు, విద్యార్థులు నడిచే మార్గం రోడ్డు వరకు నిర్మించడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా పలుమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలను గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. సమస్యను ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారి పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలకు కారణమవుతున్న అడ్డంకులను తొలగించాలని పొన్నమండ గ్రామ ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ గారు తక్షణమే స్పందించి సమస్యపై దర్యాప్తు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



