ముస్తాబాద్ మే 14 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గూడు లేని పేదలు ఉండకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణిలో అర్హులందరికీ ఇండ్లు అందజేస్తామని వెల్లడించారు.
నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికే ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి తరఫున పట్టు వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డిలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గజ్జెల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ దుబ్బాక రాజు
గూడూరు బాబు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

