మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
కూసుమంచి: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబురు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఆర్థికంగా అండగా నిలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చావా శివరామకృష్ణ, తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు అశోక్, మండల నాయకులు కటుకూరి శ్రీనివాస్ రెడ్డి, లంజపల్లి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



