ఆత్మకూరు మండలంలోని నువ్వురుపాడు పెట్రోల్ బంకును ఆత్మకూరు తహసిల్దార్ పద్మజాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు..గ్రామీణ ప్రాంతంలో రైతులకు అవసరమయ్యే డీజిల్ మరియు పెట్రోల్ ను ఇబ్బంది కలిగించకుండా పట్టాలని పెట్రోల్ బంకు నిర్వాహకులను తహసిల్దార్ సూచించారు.. పెట్రోల్ బంక్ నందు నిల్వ ఉన్న ఇంధనం వివరాలు తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. రైతుల అవసరాలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు.. వీరి వెంట స్థానిక వీఆర్వో మురళి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


