Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పులి సంచారం పసిగడుతున్న డోన్ కమెరియల్ ద్వారా ఫారెస్ట్ అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పులి సంచారం పసిగడుతున్న డోన్ కమెరియల్ ద్వారా ఫారెస్ట్ అధికారులు

ఎన్టీఆర్ జిల్లా : తిరువూరు డివిజన్

కృష్ణారావుపాలెం స్పిన్నింగ్ మిల్ వెనుక కొండ ప్రాంతంలో పులి సంచారం – అప్రమత్తమైన అధికారులు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కృష్ణారావుపాలెం స్పిన్నింగ్ మిల్ వెనుక ఉన్న కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ గారు వెంటనే స్పందించారు.

అటవీ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి సంఘటనా ప్రాంతానికి చేరుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పులి సంచారం నేపథ్యంలో సమీపంలోని పొలాల్లో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న కూలీలు, ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అలాగే కృష్ణారావుపాలెం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, పొలాల వైపు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. పులి కనిపించినా లేదా దాని సంచారానికి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే అటవీ శాఖ లేదా పోలీస్ అధికారులకు తెలియజేయాలని ఆర్డీఓ ఏ. కుమార్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికాకుండా అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

పులి సంచారం పసిగడుతున్న డోన్ కమెరియల్ ద్వారా ఫారెస్ట్ అధికారులు

పులి సంచారం పసిగడుతున్న డోన్ కమెరియల్ ద్వారా ఫారెస్ట్ అధికారులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *