దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ వైరుకు చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్న విషయాన్ని పున్నమి న్యూస్ ద్వారా ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యుత్ వైరుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను సిబ్బందితో తొలగించారు. దీంతో విద్యుత్ ప్రమాదాలకు, సరఫరా అంతరాయాలకు అవకాశం లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి దోహదపడిన పున్నమి న్యూస్‌కు గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అధికారులు సత్వర చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదే విధంగా స్పందించాలని కోరారు.



