అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ పరిధిలోని పుట్టపాడు గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని మోసుకురావాల్సి వస్తోందని తెలిపారు. మంచినీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని శిల్ప సుశీల,సోమిల లక్ష్మి తెలిపారు.గ్రామంలో శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
గ్రామ పెద్ద శిల్ప చెన్నారావు మాట్లాడుతూ.. పుట్టపాడు గ్రామానికి తాగునీటి వసతి కల్పించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వేసవితో పాటు వర్షాకాలంలోనూ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.



