అరకులోయలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో కాశీపట్నం పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన పీవీటీజీ మహిళలు తమకు ఇళ్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర అధికారులను నిలదీశారు. అర్హతలు ఉన్నప్పటికీ గృహాలు ఎందుకు మంజూరు చేయలేదో కారణాలు చెప్పాలని కోరారు. ప్రభుత్వం పీవీటీజీలకు ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం తగదన్నారు. అర్హులందరికీ వెంటనే గృహాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే డ్రైనేజీ, కొత్త పెన్షన్ల దరఖాస్తులు, వీధిలైట్లు, తాగునీటి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

పీవీటీజీలకు ఇళ్లు ఎందుకు మంజూరు చేయలేదు? అధికారులను నిలదీసిన డా. సియ్యారి దొన్ను దొర