Tuesday, 29 September 2026
  • Home  
  • *పీజీఆర్ఎస్‌ అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు* : *కమిషనర్ ఎన్ వి సత్యనారాయణ*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*పీజీఆర్ఎస్‌ అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు* : *కమిషనర్ ఎన్ వి సత్యనారాయణ*

కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28 (పున్నమి న్యూస్): ప్రజల నుంచి అందే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి తక్షణ చర్యలు చేపట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్ వి వి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 20 మంది ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.వీటిలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగానికి 1, ఇంజినీరింగ్‌ విభాగానికి 12, టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి 4, జనరల్ సెక్షన్ 1, రెవెన్యూ సెక్షన్ 2 అర్జీలు అందాయి. పీజీఆర్ఎస్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యతతో పరిష్కరించాలన కమిషనర్‌ సూచించారు.అర్జీల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి సమస్యను పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె టి సుధాకర్ ఎస్ ఈ పి వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు,హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పృధ్వి చరణ్‌, మేనేజర్‌ శిరీష్‌ కుమార్‌,ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు,డీసీపీ కె.వి. కృష్ణారావు,ఈఈ కనకారావు, మత్స్యరాజు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28 (పున్నమి న్యూస్): ప్రజల నుంచి అందే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి తక్షణ చర్యలు చేపట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్ వి వి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 20 మంది ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.వీటిలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగానికి 1, ఇంజినీరింగ్‌ విభాగానికి 12, టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి 4, జనరల్ సెక్షన్ 1, రెవెన్యూ సెక్షన్ 2 అర్జీలు అందాయి.
పీజీఆర్ఎస్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యతతో పరిష్కరించాలన కమిషనర్‌ సూచించారు.అర్జీల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి సమస్యను పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె టి సుధాకర్ ఎస్ ఈ పి వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు,హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పృధ్వి చరణ్‌, మేనేజర్‌ శిరీష్‌ కుమార్‌,ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు,డీసీపీ కె.వి. కృష్ణారావు,ఈఈ కనకారావు, మత్స్యరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.