దుత్తలూరు మండలం నందిపాడు పంచాయతీ బోటికర్లపాడు గ్రామానికి చెందిన జనసేన కుటుంబ సభ్యుడు కావలి హరిప్రసాద్ కుమారుడు, బీటెక్ విద్యార్థి సంతోష్ చదువుకుంటున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆసుపత్రికి వెళ్లి సంతోష్‌ను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో దుత్తలూరు జనసేన మాజీ మండల అధ్యక్షుడు దుంపలగడ్డ రవికుమార్, హరిప్రసాద్ పాల్గొన్నారు.

పాము కాటుకు గురైన బీటెక్ విద్యార్థిని పరామర్శించిన జనసేన నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు
దుత్తలూరు మండలం నందిపాడు పంచాయతీ బోటికర్లపాడు గ్రామానికి చెందిన జనసేన కుటుంబ సభ్యుడు కావలి హరిప్రసాద్ కుమారుడు, బీటెక్ విద్యార్థి సంతోష్ చదువుకుంటున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆసుపత్రికి వెళ్లి సంతోష్‌ను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో దుత్తలూరు జనసేన మాజీ మండల అధ్యక్షుడు దుంపలగడ్డ రవికుమార్, హరిప్రసాద్ పాల్గొన్నారు.

