బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 22 ( పున్నమి విలేఖరి )
మండలంలోని పాత మినగల్లు ఇసుక రీచ్ నుండి నిత్యం టిప్పర్లు తిరుగుతుండడంతో గ్రామ శివారులో పంట కాలవపై ఉన్న బ్రిడ్జి
సిదిలావస్తకు చేరింది. ఓ ఇసుక టిప్పర్ బ్రిడ్జి మీద నుండి వెలుతుండగా హటాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. అదృష్టవశాత్తు టిప్పర్ బ్రిడ్జి దాటగానే ఈ బ్రిడ్జి కూలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ బ్రిడ్జి కూలడంతో కాలువ అవతల రోజూ పొలం పనులకు వెళ్లే ప్రజలంతా అవస్తపాడాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీంతో కాలువ అవతలకు వెళ్లాలంటే చుట్టూతిరిగి వెళ్లాలని గ్రామంలోని పలువురు ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.