– రక్తదాన శిబిరం.. కేక్ కటింగ్‌తో ఘన సంబరాలు
– పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆనాల సునీల్‌కుమార్ పిలుపు
జనసేన అధినేత, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలి మండలంలో సర్వం సిద్ధమైంది. జనసేన యువనాయకులు ఆనాల సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ జన్మదినం అంటే జనసేన వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులకు పండగ వాతావరణమేనని నాయకులు పేర్కొన్నారు.
ఉదయం 9 గంటలకు రైల్వేకోడూరు నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమై చిట్వేలి జనసేన కార్యాలయానికి చేరుకోనుంది. అక్కడి నుంచి తిరిగి బైక్ ర్యాలీగా స్టేట్‌బ్యాంక్ వద్దకు చేరుకుని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఘనంగా కేక్ కటింగ్, ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని, ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆనాల సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. నీతి, నిజాయితీతో ప్రజల కోసం నిరంతరం పరితపించే నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమానికి యనమల భాస్కర్, బత్యాల చెంగల్‌రాయుడు, కస్తూరి విశ్వనాథనాయుడు, జోగినేని మనీ, మాచినేని విశ్వేశ్వర్‌నాయుడు, పంతగాని నరసింహప్రసాద్, కేకే చౌదరి, కాకర్ల నాగార్జుననాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


