Wednesday, 30 September 2026
  • Home  
  • పల్లె పండుగ–3.0కు ఉదయగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ–3.0కు ఉదయగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఉదయగిరికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు, శిలాఫలకాల ఆవిష్కరణ, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ప్రజలు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.