ఈ నెల 29న వరికుంటపాడు (M) రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగ-3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వింజమూరు క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్న నేపథ్యంలో ముందస్తు సమన్వయం చేసుకోవాలని సూచించారు.



