05-06-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు.
సమాజంలో ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరనం కాపాడాలని మనుబోలు ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఐజేఎం టోల్ ప్లాజా సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సహకారం అందించిన ఐజెఎంవారికి ధన్యవాదాలు తెలిపారు. బాధ్యత గా మొక్కలు నాటడంవలన కాలుష్య కోరల్లో నుండి బయటపడే అవకాశం వుందన్నారు. సేఫ్టీ మేనేజర్ లోకేష్ మాట్లాడుతూ మొక్కలు నాటితే ఆక్సిజన్ తోపాటు కాలుష్యం నివారించవచ్చన్నారు. మనుబోలు పోలీస్ స్టేషన్ లోఎస్ఐ చేతులమీదుగా మొక్కలు నాటడంశుభపరిణామంఅన్నారు .ఈకార్యక్రమాల్లోఐజెఎం సిబ్బంది బాలాజీ మరియ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.