పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలే మేలు
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, సెప్టెంబరు 12. (పున్నమి ప్రతినిధి )
కొత్తవలస జంక్షన్ లో ఈరోజు శనివారం డిసిఏం ఏ స్ చైర్మన్ గోంప కృష్ణ ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ
పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో కొత్తవలసలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించానని తెలిపారు.
మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు..భక్తులు, స్థానికులు, పాల్గొన్నారు


