ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
2022లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఖమ్మంలోని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పుల్లాబత్తుల పొగడ కృష్ణ అర్జున్ మంగళవారం తీర్పు వెలువరించారు. సూర్యాపేటకు చెందిన ఆలేటి గణేష్, బట్టు హరీష్‌లు బైక్‌పై అక్రమంగా 7 కిలోల ఎండు గంజాయిని తరలిస్తూ ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. విచారణ అనంతరం ఇద్దరికీ పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹1 లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.



