కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 30(పున్నమి న్యూస్):
కాకినాడ జిల్లా పోలీసు యూనిట్లో సుదీర్ఘకాలం అవిశ్రాంతంగా,అంకితభావంతో విశిష్ట సేవలు అందించి నేడు పదవీ విరమణ పొందిన సామర్లకోట ఎస్సై ఎ. గరగారావు,ట్రాఫిక్-2 హెడ్ కానిస్టేబుల్ వి. శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్
జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల సేవలను కొనియాడుతూ,పోలీసు శాఖకు వారు అందించిన సేవలు, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు.పదవీ విరమణ అనంతరం వారి భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డా.మహంతి కిషోర్ కుమార్,డీఎస్పీ (ఏఆర్) వి.జి.శ్రీహరి రావు,రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.వెంకటరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.వి.వి.సత్యనారాయణ మూర్తి,జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. సత్యమూర్తి,పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


