చింతకానీ / ఖమ్మం
చింతకాని మండలంలోని పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు గురువారం క్రీభ్కో కంపెనీకి చెందిన 1,222 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 523 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 400, మహబూబాబాద్ జిల్లాకు 300, సీఆర్‌పీ ఖమ్మంకు 100 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు పేర్కొన్నారు. కేటాయించిన యూరియాను రైతులకు అందుబాటులో ఉండేలా పంపిణీ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మొత్తం నిల్వలో ప్రైవేట్ డీలర్లకు 500.91 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్‌కు 722.09 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు DAO పుల్లయ్య వెల్లడించారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న నిల్వలను క్రమబద్ధంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.



