ఖానాపురం పున్నమి ప్రతినిధి..
నిన్న రాత్రి ఇటుకలపల్లి బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నల్లబెల్లి మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి రవీందర్ గారు ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మెడికవర్ హాస్పిటల్‌కు వెళ్లి కస్తూరి రవీందర్ గారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో: మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు. పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



