ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతి నిధి)
రఘునాథపాలెం మండలం గ్రామపంచాయతీ నూతన సర్పంచుల సత్కార సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
“సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు నిదర్శనమే ఈసారి పంచాయితీ ఎన్నికల ఫలితాలు” అని అన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు
కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పని చేసి పార్టీని గెలిపించారని
హామీలు అమలు చేసే బాధ్యత తనదేనని
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలక భూమిక వహించాలన్నారు
రాజకీయాల్లో ఓపిక, సహనం అత్యవసరమని,
“ఓటు వేయమని అడగలేదు… ప్రజా పాలన చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు” అని తుమ్మల స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రజలందరూ మెచ్చేలా సర్పంచులు పనిచేయాలని సూచించారు.
మండలంలో కాంగ్రెస్ గెలుపు సాధనలో కృషి చేసిన పార్టీ ఇన్‌ఛార్జ్‌లకు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


