వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: మండలంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం చేసిన ఏర్పాట్లను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- దుత్తలూరులో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు.
- నామినేషన్ల స్వీకరణ విధానం, సిబ్బందికి కేటాయించిన బాధ్యతలు, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సౌకర్యాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దుత్తలూరు: మండలంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం చేసిన ఏర్పాట్లను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దుత్తలూరులో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణ విధానం, సిబ్బందికి కేటాయించిన బాధ్యతలు, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సౌకర్యాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణకు సహకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పరిశీలనలో ఇన్చార్జి ఎంపీడీవో మల్లికార్జున్, ఎస్ఐ మహేంద్ర పాల్గొన్నారు.