వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
కోవూరు, నవంబరు 20: నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జువ్వలదిన్నె నుంచి నెల్లూరుకు ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను విడవలూరు మండలం రామలింగాపురం గ్రామానికి చెందిన మేకల వంశీ, కొండూరు సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Uploaded Video: