వార్త ముఖ్యాంశాలు
- చేజర్ల, నవంబర్ 19: ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా కూటమి అభ్యర్థి డొంకల చెంచు నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- గురువారం అధికారుల సమక్షంలో నిర్వహించిన ఎన్నిక ప్రక్రియలో మండల పరిషత్ సభ్యులు ఆయనకు మద్దతు ప్రకటించారు.
- ఉపాధ్యక్షుడిగా దొంతల ప్రభాకర్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చెంచు నరసింహారావు మాట్లాడుతూ..
చేజర్ల, నవంబర్ 19: ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా కూటమి అభ్యర్థి డొంకల చెంచు నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అధికారుల సమక్షంలో నిర్వహించిన ఎన్నిక ప్రక్రియలో మండల పరిషత్ సభ్యులు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా దొంతల ప్రభాకర్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చెంచు నరసింహారావు మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యత అప్పగించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, జిల్లా కూటమి నాయకులకు, అధికారులకు, ఎంపీటీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత బాధ్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు. మండల ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఉపాధ్యక్షుడు దొంతల ప్రభాకర్ మాట్లాడుతూ.. మండల పరిషత్ సభ్యుల సహకారంతో అధ్యక్షుడితో కలిసి చేజర్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల పరిషత్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.