Saturday, 12 July 2025
  • Home  
  • నెల్లూరు విద్యారంగంలో కొత్త అధ్యాయం.. జి.వి.కె ఇంటర్నేషనల్ స్కూల్ తో..
- Featured - ఆంధ్రప్రదేశ్

నెల్లూరు విద్యారంగంలో కొత్త అధ్యాయం.. జి.వి.కె ఇంటర్నేషనల్ స్కూల్ తో..

జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (మార్చి పున్నమి) విద్యా రంగ చరిత్రలో కొత్త అధ్యాయం కు శ్రీకారం చుడుతున్నామని ప్రఖ్యాత సి బి ఎస్ సి గర్ల్స్ స్కూల్ గా జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి వేదిక సిద్ధం చేసిందని కస్తూరి దేవి విద్యా కమిటీ పేర్కొంది .బుధవారం నాడు విద్యా కమిటీ కార్యదర్శి దొడ్లశేషారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పి.వి.ప్రసన్నరెడ్డి, పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి, విశ్రాంత ఐ.ఎ.యస్ అధికారి రామ్ శేఖర్,జి.వి.కె ఇంటర్ నేషనల్ స్కూల్ ఇ.డి ఉషారెడ్డి విలేకరుల సమావేశంలో ప్రీమియర్ సి బి ఎస్ సి గర్ల్స్ స్కూల్ వివరాలను తెలిపారు. డాక్టర్. జివికె రెడ్డి జన్మభూమి మీద అభిమానంతో 25 కోట్ల విరాళం అందజేసిన నేపథ్యంలో ఈ స్కూలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికి అందుబాటులో ఉండేలా ఉత్తమ విద్యను అందించేందుకు సిద్ధమైందని వారు తెలిపారు. నాణ్యమైన బోధన లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నూతన బోధన పద్ధతులతో ప్రశ్నా దారిత బోధన విధానాలు సాంకేతికతను విద్యార్థుల సృజనాత్మక జోడించి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. స్కూల్లో అత్యధిక ఆధునిక,లేబరేటరీలు అందుబాటులో ఉంటూ నిత్యం సీసీటీవీ ల పర్యవేక్షణతో కూడిన భద్రతా వ్యవస్థ మధ్య సురక్షితమైన విద్యను బాలికలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు దొడ్ల శేషారెడ్డి తెలిపారు. కస్తూరి విద్యాలయావరణంలో ఉన్న ప్రస్తుత ఉచిత పాఠశాల ఉచిత బోధనను యధాతధంగా అందిస్తుందని, నూతనంగా ఏర్పడిన పాఠశాల నో ప్రాఫిట్ నో లాస్ కింద విద్యను అందిస్తుందని పి.వి.ప్రసన్నరెడ్డి తెలిపారు. ఇది లాభార్జన కోసం అయితే ఖచ్చితంగా కాదని కేవలం నెల్లూరు ప్రాంత బాలికలకు ఉన్నత ఆధునిక విద్యను అందించాలనే జీవీకే ఆశయం కోసమని ప్రసన్న రెడ్డి తెలిపారు. ఇందులో 1500 మందికి విద్యాభోధన చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు ప్రాంత బాలికలకు ఇది ఒక వరమని ఆయన తెలిపారు. ఈ పాఠశాలను విజయవంతంగా తీర్చిదిద్దేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రామ్ శేఖర్, ప్రముఖ విద్యావేత్త ఉషా రెడ్డిలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు ప్రాంతంలో ఇప్పటి వరకు లేని విధంగా ఈ పాఠశాల తమ పని తీరు చూపించి నెల్లూరు లో బాలికా విద్య లో కొత్త చరిత్ర సృష్టించే విధంగా పని చేయడం ఖాయమని ఉషారెడ్డి తెలిపారు. జి.వి.కె. రెడ్డి ఉన్నతమైన ఆశయాలకు వేదికగా ఏర్పడిన ఈ పాఠశాల పర్యవేక్షణలో తనకు అవకాశం కల్పించడం తన అదృష్టమని విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారి రామ్ శేఖర్ పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఉన్న ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకొని విజయవంతం చేస్తే డాక్టర్ జి.వి.కె.రెడ్డి జిల్లాలో విద్యా రంగం పై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి తెలిపారు. పాఠశాల కు సంబంధించిన విద్యా వివరాలను ఎ.ఒ నరేష్ వివరించారు.

జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (మార్చి పున్నమి)
విద్యా రంగ చరిత్రలో కొత్త అధ్యాయం కు శ్రీకారం చుడుతున్నామని ప్రఖ్యాత సి బి ఎస్ సి గర్ల్స్ స్కూల్ గా జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి వేదిక సిద్ధం చేసిందని కస్తూరి దేవి విద్యా కమిటీ పేర్కొంది .బుధవారం నాడు విద్యా కమిటీ కార్యదర్శి దొడ్లశేషారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పి.వి.ప్రసన్నరెడ్డి, పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి, విశ్రాంత ఐ.ఎ.యస్ అధికారి రామ్ శేఖర్,జి.వి.కె ఇంటర్ నేషనల్ స్కూల్ ఇ.డి ఉషారెడ్డి
విలేకరుల సమావేశంలో ప్రీమియర్ సి బి ఎస్ సి గర్ల్స్ స్కూల్ వివరాలను తెలిపారు. డాక్టర్. జివికె రెడ్డి జన్మభూమి మీద అభిమానంతో 25 కోట్ల విరాళం అందజేసిన నేపథ్యంలో ఈ స్కూలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికి అందుబాటులో ఉండేలా ఉత్తమ విద్యను అందించేందుకు సిద్ధమైందని వారు తెలిపారు. నాణ్యమైన బోధన లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నూతన బోధన పద్ధతులతో ప్రశ్నా దారిత బోధన విధానాలు సాంకేతికతను విద్యార్థుల సృజనాత్మక జోడించి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. స్కూల్లో అత్యధిక ఆధునిక,లేబరేటరీలు అందుబాటులో ఉంటూ నిత్యం సీసీటీవీ ల పర్యవేక్షణతో కూడిన భద్రతా వ్యవస్థ మధ్య సురక్షితమైన విద్యను బాలికలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు దొడ్ల శేషారెడ్డి తెలిపారు. కస్తూరి విద్యాలయావరణంలో ఉన్న ప్రస్తుత ఉచిత పాఠశాల ఉచిత బోధనను యధాతధంగా అందిస్తుందని, నూతనంగా ఏర్పడిన పాఠశాల నో ప్రాఫిట్ నో లాస్ కింద విద్యను అందిస్తుందని పి.వి.ప్రసన్నరెడ్డి తెలిపారు. ఇది లాభార్జన కోసం అయితే ఖచ్చితంగా కాదని కేవలం నెల్లూరు ప్రాంత బాలికలకు ఉన్నత ఆధునిక విద్యను అందించాలనే జీవీకే ఆశయం కోసమని ప్రసన్న రెడ్డి తెలిపారు. ఇందులో 1500 మందికి విద్యాభోధన చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు ప్రాంత బాలికలకు ఇది ఒక వరమని ఆయన తెలిపారు. ఈ పాఠశాలను విజయవంతంగా తీర్చిదిద్దేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రామ్ శేఖర్, ప్రముఖ విద్యావేత్త ఉషా రెడ్డిలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు ప్రాంతంలో ఇప్పటి వరకు లేని విధంగా ఈ పాఠశాల తమ పని తీరు చూపించి నెల్లూరు లో బాలికా విద్య లో కొత్త చరిత్ర సృష్టించే విధంగా పని చేయడం ఖాయమని ఉషారెడ్డి తెలిపారు. జి.వి.కె. రెడ్డి ఉన్నతమైన ఆశయాలకు వేదికగా ఏర్పడిన ఈ పాఠశాల పర్యవేక్షణలో తనకు అవకాశం కల్పించడం తన అదృష్టమని విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారి రామ్ శేఖర్ పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఉన్న ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకొని విజయవంతం చేస్తే డాక్టర్ జి.వి.కె.రెడ్డి జిల్లాలో విద్యా రంగం పై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి తెలిపారు. పాఠశాల కు సంబంధించిన విద్యా వివరాలను ఎ.ఒ నరేష్ వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.