వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు: మాతృత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూనే విధి పట్ల అంకితభావాన్ని చాటిన మహిళా కానిస్టేబుల్ అందరి ప్రశంసలు అందుకున్నారు.
- నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ హృద్యమైన ఘటన చోటుచేసుకుంది.మహిళా కానిస్టేబుల్ శిరీష తన చంటి బిడ్డను వెంట తీసుకుని పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహించారు.
- బిడ్డను చూసుకుంటూనే, ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం పలువురిని ఆకట్టుకుంది.ఒకవైపు కన్నబిడ్డ సంరక్షణ..
నెల్లూరు: మాతృత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూనే విధి పట్ల అంకితభావాన్ని చాటిన మహిళా కానిస్టేబుల్ అందరి ప్రశంసలు అందుకున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ హృద్యమైన ఘటన చోటుచేసుకుంది.మహిళా కానిస్టేబుల్ శిరీష తన చంటి బిడ్డను వెంట తీసుకుని పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహించారు. బిడ్డను చూసుకుంటూనే, ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం పలువురిని ఆకట్టుకుంది.ఒకవైపు కన్నబిడ్డ సంరక్షణ.. మరోవైపు ప్రజాస్వామ్య పండుగలో విధి నిర్వహణ.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ శిరీష చూపిన నిబద్ధతకు స్థానికులు అభినందనలు తెలిపారు. ఆమెను చూసి పలువురు మాతృమూర్తులు, ప్రజలు స్ఫూర్తి పొందారు.మాతృత్వం మమకారానికి ప్రతీక అయితే.. విధి నిర్వహణ బాధ్యతకు నిదర్శనం. ఈ రెండింటినీ సమతుల్యం చేసిన శిరీష నిజంగా అభినందనీయురాలు.