*నీరు తగ్గడంతో రాజీవ్ కెనాల్ లింక్‌లో చాపల వేట సందడి*
ఏన్కూరు:
సీతారామ ప్రాజెక్టు రాజీవ్ కెనాల్ లింక్‌లో నీటి మట్టం తగ్గడంతో ఏన్కూరు మండల ప్రజలు చాపల వేటకు తరలివచ్చారు.
కెనాల్‌లో నీరు తగ్గిపోవడంతో చేపలు సులభంగా కనిపించడంతో పలువురు స్థానికులు వలలు, ఇతర వేట పరికరాలతో చేపల వేటకు దిగారు.
కెనాల్‌లో నీరు తగ్గిన ప్రాంతాల్లో చేపలు గుంపులుగా ఉండటంతో ఉదయం నుంచే స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి చేపలు పట్టారు.
దీంతో కెనాల్ పరిసర ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
పలువురు యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా చేపలు పడుతూ కనిపించారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా కెనాల్‌లోకి వచ్చిన నీరు తగ్గడంతో చేపల వేటకు అనుకూల పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
పట్టిన చేపలను కొందరు తమ అవసరాలకు వినియోగించుకోగా, మరికొందరు విక్రయిస్తున్నట్లు సమాచారం.
కెనాల్‌లో చేపల వేటకు వెళ్లే సమయంలో నీటి లోతు, ప్రవాహాన్ని అంచనా వేసుకుని జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.


