పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లోని మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటి ఇతర పరిశ్రమల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు శాసనసభలో పరిశ్రమలు ఐటీ రంగాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు సుమారు 12 ముంపు గ్రామాల్లో ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని పరిశ్రమల ఏర్పాటుతో వలసలకు అడ్డుకట్టు వేయవచ్చు అన్నారు సిరిసిల్లలో మాదిరిగా మగ్గాల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంచి శ్రీధర్ బాబుని కోరారు



