Wednesday, 16 September 2026
  • Home  
  • నిబంధనలు పాటించని ఇంటర్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
- ఖమ్మం

నిబంధనలు పాటించని ఇంటర్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

ఖమ్మం నగరము లోని ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యార్థులకు సరైన ఆహారం అందించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు కళాశాలలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఖమ్మం నగరము లోని
ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యార్థులకు సరైన ఆహారం అందించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు కళాశాలలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.