ముంబై: ఫార్చ్యూన్ ఇండియా ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘40 Under 40’ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ప్రతిభావంతులైన achieversలో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సందర్భంగా నారా బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. నేటి విజయవంతమైన వ్యక్తులతో పాటు భవిష్యత్ నాయకులు, ప్రతిభావంతులు ఒకే వేదికపై కలవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తమ వార్షికోత్సవం సందర్భంగా బ్రాహ్మణికి ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు రావడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ‘Fortune India 40 Under 40’లో బ్రాహ్మణికి లభించిన ఈ గుర్తింపుపై పలువురు అభినందనలు తెలిపారు.



