క్రైస్తవ మతస్థులు అధికంగా నివసించే నాగాలాండ్ రాష్ట్రంలో ఆదివారం జరపాలని నిర్ణయించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను ప్రభుత్వం సోమవారానికి వాయిదా వేసింది. విద్యార్థి సంఘాలు, చర్చి సంస్థలు, గిరిజన సంఘాలు ఆదివారం ప్రార్థనలకు ప్రాధాన్యం ఉన్నందున అభ్యంతరం వ్యక్తం చేశాయి. విద్యాసంస్థల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ముందుగా జారీ చేసిన ఆదేశాలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. మత విశ్వాసాలను గౌరవిస్తూ కార్యక్రమాలను జూన్ 22న నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సవరించిన ఉత్తర్వులు జారీ చేసింది.

నాగాలాండ్‌లో యోగా డే కార్యక్రమాలు వాయిదా