దరఖాస్తులకు సెప్టెంబర్ 30 చివరి గడువు!
అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా విద్యాశాఖ అధికారి సూచన
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 03 (పున్నమి రిపోర్టర్):
2027–28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉండబోయే సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
నవోదయ విద్యాలయ సమితి, PM SHRI JNV మార్గదర్శకాల మేరకు ఈ ప్రవేశ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశానికి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు.
ప్రవేశం పొందేందుకు అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత ఎంపిక/ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు నిర్దేశిత ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026 అని అధికారులు తెలిపారు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు లింకులు
9వ తరగతి ప్రవేశం:
https://cbseitms.nic.in/2026/nvsix_9
11వ తరగతి ప్రవేశం:
https://cbseitms.nic.in/2026/nvsxi_11
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు.
– జిల్లా విద్యాశాఖ అధికారి
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా


