స్వాతంత్ర్య స్ఫూర్తితో… దేశ సేవే లక్ష్యంగా
నర్సంపేట బీజేపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నర్సంపేట నియోజకవర్గ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ప్రజా సేవను బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం… ధర్మం కోసం… ప్రజల కోసం… సేవే మన సంకల్పం” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహరాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, 28వ వార్డ్ కౌన్సిలర్ జూలూరు రోజా రాణి, పార్లమెంట్ కో కన్వీనర్ రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, నియోజకవర్గ నాయకులు జూలూరి మనిష్ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు ,బాల్నే జగన్ ,కూనమల్ల పృథ్వీరాజ్ ,జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్ , నర్సంపేట నాయకులుst మోర్చా భానోత్ రాజేందర్,ex MPTC రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, BJYM ఉపాధ్యక్షులు విగ్నేష్ గౌడ్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శలు ఠాకూర్ విజయ్ సింగ్, సూత్రపు సరిత, పట్టణ ఉపాధ్యక్షులు కందగట్ల నాగరాజు ,కాసుల నాగేంద్రబాబు, బిజెపి పట్టణ నాయకులు ముత్యాల శ్రీనివాస్, చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్ ,తౌటం నిశాంత్, నర్సంపేట బీజేపీ రూరల్ నాయకులు తాళ్లపల్లి రాము, బోయిని సుధాకర్, జరప్పుల వీరన్న, పొదిల్ల కుమారస్వామి హర్షవర్ధన్,మూడు సుక్య, నరసయ్య,bjym నాయకులు చిలువేరు అన్వేష్,తప్పెట్ల సతీష్, గోస్కుల సందీప్, సంగేపు తేజ, కొండ్ర తరుణ్ సాయి, కళ్యాణ్ , భానాత్ హర్శవర్ధన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారుబీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు


