నర్రవాడ మజరా ఉలవవారిపాలెం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని అందించారు. గ్రామానికి చెందిన భక్తులు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు, గ్రామస్థులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.



