Thursday, 9 July 2026
  • Home  
  • దేశ భక్తులను తయారు చేసే కర్మాగారం ఎబివిపి : ఛత్రపతి చౌహాన్
- ఖమ్మం

దేశ భక్తులను తయారు చేసే కర్మాగారం ఎబివిపి : ఛత్రపతి చౌహాన్

ఖమ్మం జులై (పున్నమి న్యూస్) జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ ఖమ్మం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఎబివిపి ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిందన్నారు. ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఎబివిపి నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు విస్తరించి 78 లక్షల మంది విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని తెలిపారు. ఎబివిపి ఇచ్చిన అనేక నినాదాలు నేడు దేశ విధానాలుగా మారాయని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు కోసం ఎబివిపి చేసిన ఉద్యమం విజయవంతమైందని, అక్రమ వలసదారులపై “సేవ్ అస్సాం టుడే.. సేవ్ ఇండియా టుమారో” నినాదంతో చేపట్టిన ఉద్యమాలు జాతీయ భద్రతకు దోహదపడ్డాయని అన్నారు. దేశవ్యాప్తంగా జాతీయవాద భావజాలాన్ని పెంపొందించేందుకు ఎబివిపి కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేశారని, అనేక మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారని ఛత్రపతి చౌహాన్ పేర్కొన్నారు. నల్గొండ గడ్డపై జాతీయవాదాన్ని, దేశభక్తిని పెంపొందించిన ఏచూరి శ్రీనివాస్ అన్నకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నించిన శక్తులకు వ్యతిరేకంగా ఎబివిపి జాతీయవాద భావాలను విద్యార్థుల్లో పెంచిందని అన్నారు. వేలాది మంది విద్యార్థులు భారత్ మాతాకీ జై అంటూ నినదించడం జాతీయవాదానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎబివిపి దేశభక్తులను తయారు చేసే కర్మాగారం అని, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలిపేందుకు 78 సంవత్సరాలుగా ఎబివిపి చేస్తున్న ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు ప్రణీత్, అజయ్, విభాగ్ గర్ల్ ఇంచార్జి గీతాంజలి, నగర కార్యదర్శి కార్తీక్, దీపక్, సిద్ధు, అర్జున్, సాయి చరణ్, వేణు, లెవిన్, ఈశ్వర్, మహేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)

జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ

ఖమ్మం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఎబివిపి ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిందన్నారు.

ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఎబివిపి నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు విస్తరించి 78 లక్షల మంది విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని తెలిపారు. ఎబివిపి ఇచ్చిన అనేక నినాదాలు నేడు దేశ విధానాలుగా మారాయని పేర్కొన్నారు.

కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు కోసం ఎబివిపి చేసిన ఉద్యమం విజయవంతమైందని, అక్రమ వలసదారులపై “సేవ్ అస్సాం టుడే.. సేవ్ ఇండియా టుమారో” నినాదంతో చేపట్టిన ఉద్యమాలు జాతీయ భద్రతకు దోహదపడ్డాయని అన్నారు.

దేశవ్యాప్తంగా జాతీయవాద భావజాలాన్ని పెంపొందించేందుకు ఎబివిపి కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేశారని, అనేక మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారని ఛత్రపతి చౌహాన్ పేర్కొన్నారు. నల్గొండ గడ్డపై జాతీయవాదాన్ని, దేశభక్తిని పెంపొందించిన ఏచూరి శ్రీనివాస్ అన్నకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నించిన శక్తులకు వ్యతిరేకంగా ఎబివిపి జాతీయవాద భావాలను విద్యార్థుల్లో పెంచిందని అన్నారు. వేలాది మంది విద్యార్థులు భారత్ మాతాకీ జై అంటూ నినదించడం జాతీయవాదానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఎబివిపి దేశభక్తులను తయారు చేసే కర్మాగారం అని, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలిపేందుకు 78 సంవత్సరాలుగా ఎబివిపి చేస్తున్న ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు ప్రణీత్, అజయ్, విభాగ్ గర్ల్ ఇంచార్జి గీతాంజలి, నగర కార్యదర్శి కార్తీక్, దీపక్, సిద్ధు, అర్జున్, సాయి చరణ్, వేణు, లెవిన్, ఈశ్వర్, మహేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.