Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

దీపావళి టపాసుల దుకాణాల తనిఖీ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి దుకాణాల నిర్వాహకులకు గాజువాక సీఐ వాస

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దీపావళి టపాసుల దుకాణాల తనిఖీ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి దుకాణాల నిర్వాహకులకు గాజువాక సీఐ వాస

గాజువాక, నవంబర్ 5 (పున్నమి ప్రతినిధి): దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసుల విక్రయ దుకాణాల వద్ద భద్రతా ఏర్పాట్లపై గాజువాక పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కవానిపాలెంలో ఏర్పాటు చేస్తున్న టపాసుల దుకాణాలను గురువారం గాజువాక సీఐ సీహెచ్ వాసు నాయుడు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా దుకాణాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. టపాసుల విక్రయ కేంద్రాల వద్ద తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే బాణాసంచా విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు.

దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా గాజువాక పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

దీపావళి టపాసుల దుకాణాల తనిఖీ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి దుకాణాల నిర్వాహకులకు గాజువాక సీఐ వాస

దీపావళి టపాసుల దుకాణాల తనిఖీ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి దుకాణాల నిర్వాహకులకు గాజువాక సీఐ వాస

దీపావళి టపాసుల దుకాణాల తనిఖీ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి దుకాణాల నిర్వాహకులకు గాజువాక సీఐ వాస

Leave a comment

Your email address will not be published. Required fields are marked *