దీన్ దయాల్ నగర్‌లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్
SPSR నెల్లూరు జిల్లా, తేది: 09.05.2026: జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిపై విచారణ కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, మహిళల భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.



