Tuesday, 18 August 2026
  • Home  
  • దివ్యాంగురాలు తులసికి మెరుగైన వైద్యం అందిస్తాం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

దివ్యాంగురాలు తులసికి మెరుగైన వైద్యం అందిస్తాం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, ఆగస్టు 17, (పున్నమి న్యూస్): ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగురాలు తులసికి సొంత ఖర్చుతోనైనా లేదా సీఎం సహాయ నిధి ద్వారానైనా పూర్తి వైద్యం అందించి మళ్లీ నడిపిస్తానని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. జూలై 31న తొట్టంబేడు మండలం మామిడిగుంట హరిజనవాడ పర్యటనలో తులసి దీనస్థితిని చూసి చలించిపోయినట్లు పేర్కొన్నారు. చెన్నై అపోలో వైద్యులతో మాట్లాడి చికిత్స చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం, అపోలో నిపుణుల బృందాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి రప్పించినట్లు చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడు మునిరాజా నాయుడు సహకారంతో తులసిని ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమరావతిలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ, విరామ సమయంలో వీడియో కాల్ ద్వారా తులసితో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. వైద్యంలో ఎలాంటి లోపం రాకూడదని స్థానిక నాయకులను, వైద్యులను ఆదేశించినట్లు చెప్పారు. రిపోర్టులు వచ్చిన వెంటనే తులసికి మెరుగైన చికిత్స అందించి, ఆమెను మళ్లీ సొంత కాళ్లపై నిలబెట్టడమే తన సంకల్పమని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.