తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం భీముని చెరువు గ్రామానికి చెందిన బాలి గాని హరిబాబు (37) మంగళవారం సాయంత్రం మృతి చెందారు.
తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త బాలిగాని హరిబాబు మృతి సమాచారాన్ని తెలుసుకున్న సత్యవేడు శాసనసభ్యులు తన స్వగ్రామ౦ కావడంతో బుధవారం ఉదయం 8 గంటలకు ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు
అనంతరం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ప్రభుత్వపరంగా తన వంతు ఆదుకోవడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో భీముని చెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
*ఆపరేషన్ చేసుకున్న వేపగుంట మణికి ఎమ్మెల్యే పరామర్శ*
భీముని చెరువు గ్రామానికి చెందిన వేపగుంట మని ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకొని ఇంటికి వచ్చారు
ఈ సమాచారం తెలుసుకున్న సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు మణిని పరామర్శించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు


