Friday, 15 May 2026
  • Home  
  • తూర్పుగోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడిగా మల్లిపూడి రాజేష్ నియామకం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు సముచిత గుర్తింపు
- తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడిగా మల్లిపూడి రాజేష్ నియామకం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు సముచిత గుర్తింపు

తాళ్లపూడి,తూర్పుగోదావరి జిల్లా (పున్నమి ప్రతినిధి )మే 15: తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఉపాధ్యక్షుడిగా తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి చెందిన మల్లిపూడి రాజేష్ నియమితులయ్యారు. పార్టీ పట్ల నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా వివిధ హోదాల్లో సేవలందించిన రాజేష్‌కు ఈ పదవి దక్కడం పట్ల స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లిపూడి రాజేష్ గతంలో బూత్ అధ్యక్షుడిగా, శక్తి కేంద్ర ప్రముఖ్‌గా, మండల ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. అదేవిధంగా ‘హర్ ఘర్ తిరంగా’ జిల్లా కన్వీనర్‌గా, ‘ఆత్మనిర్భర్ భారత్’ జిల్లా కో-కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’, గుర్రం జాషువా జయంతి కార్యక్రమాలు, వాజ్‌పేయి క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గ కన్వీనర్‌గా కూడా పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. అనేక సామాజిక, పార్టీ కార్యక్రమాల్లో కన్వీనర్‌, కో-కన్వీనర్‌గా చురుకైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మల్లిపూడి రాజేష్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించేలా మరింత కృషి చేస్తానని తెలిపారు. తనను తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రాష్ట్ర నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, జిల్లా యువమోర్చా అధ్యక్షులు పెరుమాళ్ల పవన్ కుమార్ తదితరులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తాళ్లపూడి,తూర్పుగోదావరి జిల్లా (పున్నమి ప్రతినిధి )మే 15:
తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఉపాధ్యక్షుడిగా తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి చెందిన మల్లిపూడి రాజేష్ నియమితులయ్యారు. పార్టీ పట్ల నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా వివిధ హోదాల్లో సేవలందించిన రాజేష్‌కు ఈ పదవి దక్కడం పట్ల స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మల్లిపూడి రాజేష్ గతంలో బూత్ అధ్యక్షుడిగా, శక్తి కేంద్ర ప్రముఖ్‌గా, మండల ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. అదేవిధంగా ‘హర్ ఘర్ తిరంగా’ జిల్లా కన్వీనర్‌గా, ‘ఆత్మనిర్భర్ భారత్’ జిల్లా కో-కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’, గుర్రం జాషువా జయంతి కార్యక్రమాలు, వాజ్‌పేయి క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గ కన్వీనర్‌గా కూడా పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. అనేక సామాజిక, పార్టీ కార్యక్రమాల్లో కన్వీనర్‌, కో-కన్వీనర్‌గా చురుకైన పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా మల్లిపూడి రాజేష్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించేలా మరింత కృషి చేస్తానని తెలిపారు.

తనను తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రాష్ట్ర నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, జిల్లా యువమోర్చా అధ్యక్షులు పెరుమాళ్ల పవన్ కుమార్ తదితరులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.