గోపాలపురం, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యులు, పార్టీ ఇన్‌చార్జుల ఆత్మీయ సమావేశంలో భాగంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నివాసంలో నిర్వహించిన సమావేశానికి అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


