*కర్ణాటక గెస్ట్ హౌస్ సముదాయాలకు గౌరవాధ్యక్షులుగా ఉండాలని విజ్ఞప్తి*
పున్నమి ప్రతినిధి, తిరుపతి
తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ మరియు కర్ణాటక కళ్యాణ మండపాల సముదాయాలకు చెందిన ఉద్యోగస్తులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
జనసేన పార్టీ నాయకులు శ్రీ కిరణ్ రాయల్ తో కలిసి వెళ్లిన ఉద్యోగులు, తుడా చైర్మన్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ మరియు కళ్యాణ మండపాలకు సంబంధించిన ఉద్యోగస్తుల నివాస సముదాయాలకు, ఉద్యోగ సంఘానికి గౌరవాధ్యక్షులుగా వ్యవహరించాలని డాలర్స్ దివాకర్ రెడ్డి వారు కోరారు. తమకు అండగా ఉంటూ, ఉద్యోగుల సంక్షేమానికి మరియు తమ సముదాయం అభివృద్ధికి తగిన సహకారం అందించాలని ఈ సందర్భంగా వారు తుడా చైర్మన్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారితో పాటు, కర్ణాటక గెస్ట్ హౌస్ మరియు కళ్యాణ మండపాల ఉద్యోగస్తులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


