Tuesday, 16 June 2026
  • Home  
  • తిమ్మారావుపేటను నూతన మండలంగా ఏర్పాటు చేయాలి* *- ఎమ్మెల్యే రామదాసు నాయక్‌కు వినతిపత్రం*
- ఖమ్మం

తిమ్మారావుపేటను నూతన మండలంగా ఏర్పాటు చేయాలి* *- ఎమ్మెల్యే రామదాసు నాయక్‌కు వినతిపత్రం*

*తిమ్మారావుపేటను నూతన మండలంగా ఏర్పాటు చేయాలి* *- ఎమ్మెల్యే రామదాసు నాయక్‌కు వినతిపత్రం* *ఏన్కూరు: తిమ్మారావుపేట*: తిమ్మారావుపేట గ్రామపంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ కలిసిన గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు కలిసి వినతిపత్రం అందజేశారు. తిమ్మారావుపేట చుట్టుపక్కల 15-20 గ్రామాలు ఉండగా, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రస్తుత మండల కేంద్రానికి 15 కి.మీ1 దూరం వెళ్లాల్సి వస్తోందని వారు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, “జనాభా పరంగా, భౌగోళికంగా, రెవెన్యూ పరంగా తిమ్మారావుపేట మండల కేంద్రంగా ఉండే అన్ని అర్హతలు ఉన్నాయి. నూతన మండలం ఏర్పడితే చుట్టుపక్కల వేలాది మంది రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఎంతో ఉపయోగం” అని కోరారు. వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే రామదాసు నాయక్ స్పందిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని, తిమ్మారావుపేట మండల ఏర్పాటు డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అవసరాలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేస్తుందని, త్వరలో మంచి నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*తిమ్మారావుపేటను నూతన మండలంగా ఏర్పాటు చేయాలి*
*- ఎమ్మెల్యే రామదాసు నాయక్‌కు వినతిపత్రం*

*ఏన్కూరు: తిమ్మారావుపేట*:

తిమ్మారావుపేట గ్రామపంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ కలిసిన గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు కలిసి వినతిపత్రం అందజేశారు. తిమ్మారావుపేట చుట్టుపక్కల 15-20 గ్రామాలు ఉండగా, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రస్తుత మండల కేంద్రానికి 15 కి.మీ1 దూరం వెళ్లాల్సి వస్తోందని వారు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, “జనాభా పరంగా, భౌగోళికంగా, రెవెన్యూ పరంగా తిమ్మారావుపేట మండల కేంద్రంగా ఉండే అన్ని అర్హతలు ఉన్నాయి. నూతన మండలం ఏర్పడితే చుట్టుపక్కల వేలాది మంది రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఎంతో ఉపయోగం” అని కోరారు.

వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే రామదాసు నాయక్ స్పందిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని, తిమ్మారావుపేట మండల ఏర్పాటు డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అవసరాలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేస్తుందని, త్వరలో మంచి నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.