బీఆర్‌ఎస్ మాజీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎం.డి. తాజుద్దీన్ భౌతికకాయాన్ని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాజుద్దీన్ మృతి పార్టీకి, మైనార్టీ వర్గాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ దుఃఖ సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తాజుద్దీన్‌కు నివాళులు అర్పించారు.



