శ్రీ కాళహస్తి, జులై 16, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘తల్లికి వందనం’ పథకం (2026-27) అమలుకు రూ. 10,120.78 కోట్ల భారీ బడ్జెట్తో పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసారపు సుబ్బయ్య అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 67,47,190 మంది విద్యార్థులకు, అలాగే 42,70,802 మంది అర్హులైన తల్లులకు ఎంతో లబ్ధి చేకూరనుందని ఆయన వెల్లడించారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి ఏడాదికి ₹15,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుందని, ఇందులో పాఠశాలల నిర్వహణ, పరిశుభ్రత కోసం ₹2,000 మినహాయించి, మిగిలిన మొత్తాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తారని పేర్కొన్నారు. జులై 22న మొదటి విడత నగదు పంపిణీ జరగనుండగా, ఆగస్టు 30 కల్లా మిగిలిన ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేయనున్నట్లు సుబ్బయ్య వివరించారు

తల్లికి వందనం పథకానికి రూ. 10,120 కోట్లు-టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య